Monday, January 20, 2025

బండరాళ్ల నీళ్లు …అటుకులు పేలాలు బందీలైన కూలీలకు ఆధారం

- Advertisement -
- Advertisement -

ఉత్తర్‌కాశీ : మృత్యువును జయించి బయటకు వచ్చిన సిల్క్‌యారా కూలీలు లోపల 17 రోజులు ఆత్మస్థయిర్యంతో ప్రాణాలు నిలబెట్టుకున్నారు. తాము సొరంగం రాతి పొరల మధ్యలో జాలువారే మంచినీటిని తాగుతూ, తమకు సహాయక బృందాల నుంచి అందిన అటుకులు, పేలాల వంటివి తింటూ గడిపినట్లు అనిల్ బెదియా అనే కూలీ బుధవారం తెలిపారు. జార్ఖండ్‌కు చెందిన ఈ కూలీ ఇన్నిరోజుల తరువాత తాను బయటి వెలుగు చూడటం సంతోషంగా ఉందన్నారు. కేవలం 22 సంవత్సరాల ఈ కూలీ లోపల తను ఎదుర్కొన్న పరిస్థితిని తెలిపారు.

కొద్ది రోజుల వరకూ తమకు భయం వేయలేదని, అయితే రెండు మూడు రోజులుగా భీకరమైన గాలులు వీశాయని , ఇక టన్నెల్‌లోనే తాము సమాధి అవుతామని అనుకున్నామని ఈ కూలీ తెలిపారు. ఈ లోగానే తాము బయటపడినట్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసిన కూలీల్లో అత్యధికులు 20 నుంచి 25 లోపు వయస్సున్న వారే. వీరు ధైర్యంగా లోపలి పరిస్థితిని ఎదుర్కొని 17 రోజుల పాటు ఉండగలిగారని , నడి వయస్సు వారు లేక ముసలి వారు అయితే పరిస్థితి వేరే విధంగా ఉండేదని ఆందోళన వ్యక్తం అయింది.

యోగా లోపల నడక సాగిస్తూ గడిపాం
టన్నెల్ కూలిన తరువాత కొంత సేపటి వరకూ కలవరం చెందాం. అయితే ప్రభుత్వ సహాయక బృందాలు తమకు విముక్తి కల్పిస్తాయనే ఆశతో గడిపాం. ఆరోగ్యం కోసం లోపల యోగా, వీలైనప్పుడల్లా నడక సాగించామని విముక్తి పొందిన కూలీలు తెలిపారు. మంగళవారం రాత్రి కొందరు కూలీలతో ప్రధాన మంత్రి మోడీ ఫోన్‌లో మాట్లాడారు. తాము ప్రధానికి, సిఎం ధామికి , సహాయక బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇన్నిరోజులు బందీలుగా మారి ధైర్యంతో ఉండటం చిన్న విషయం కాదని వారిని ప్రధాని కొనియాడారు. తాను ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ వచ్చానని, అయితే సురక్షితంగా బయటపడినట్లు తెలిసిన తరువాతనే తన మనసు కుదుటపడిందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News