Wednesday, January 22, 2025

కెమెరాకు చిక్కిన టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు

- Advertisement -
- Advertisement -

అందరూ ఆరోగ్యంగా ఉట్లు అధికారుల ప్రకటన
10 రోజుల తర్వాత రెస్కూ ఆపరేషన్‌లోభారీ పురోగతి

ఉత్తరకాశి: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడే రెస్కూ ఆపరేషన్‌లో భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సుమారు 240 గంటల తర్వాత తొలిసారి కెమెరాకు చిక్కారు. దీంతో గత పది రోజులుగా వారిని బైటికి తీసుకు రావడానికి శ్రమిస్తున్న సిబ్బందికి భారీ ఊరట లభించింది. 6 అంగుళాల చుట్టుకొలత ఉన్న ప్రత్యామ్నాయ పైపు సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఉండే చోటికి చేరుకున్న విషయం తెలిసిందే. అధికారులు దానిగుండా ఒక ఎండోస్కోపిక్ కెమెరాను పంపించారు.

కార్మికులందరినీ దాని దగ్గరికి రావాలని కోరారు. దీంతో కార్మికులందరినీ ఆ కెమెరా బంధించింది.దీనికి సంబంధించిన వీడియోలను అధికారులు విడుదల చేశారు. అయితే ప్రమాదం జరిగి పది రోజులు కావడంతో వారంతా నీరసంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఆరోగ్యంగా ఉండడంఊరటనిచ్చే విషయమే. కాగా సోమవారం రాత్రి కార్మికులకు పైప్ ద్వారా గాజు సీసాల్లో కిచిడీ పంపించారు. అంతకు ముందు డ్రైఫ్రూట్స్ మాత్రమే అందించారు. కాగా మంగళవారం ఉదయం వారి కోసం వేడివేడి అల్పాహారం కూడా సిద్ధం చేశారు.త్వరలో వారికి మొబైల్ ఫోన్లు, చార్జర్లు కూడా పంపిస్తామని రెస్కూ ఆపరేషన్ ఇన్‌చార్జి కల్నల్ దీపక్ పాటిల్ తెలిపారు.

ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి రెస్కూ ఆపరేషన్ పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ధామి సోషల్ మీడియాతో తొలియజేశారు. మరోవైపు టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికలును సురక్షితంగా బైటికి తీసుకు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపెద్ద డ్రిల్లింగ్ యంత్రాలు సొరంగం వద్దకు చేరుకున్నాయి. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుల బృందం కూడా ఘటనా స్థలంలో ఉంది. ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News