Monday, December 23, 2024

అమీన్‌పూర్ మున్సిపల్ ప్రగతికి కృషి

- Advertisement -
- Advertisement -
  • సొంత నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్‌పూర్: అమీన్‌పూర్ మున్సిపాలిటీ ప్రగతికి ప్రణాళికా బద్ధంగా నిధులు కేటాయిస్తూ కృషి చేస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 19 వార్డు లింగమయ్య కాలనీలో జివిఆర్ ఎంట్ర్పజెస్ సౌజన్యంతో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు.

250కి పైగా కాలనీలలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఉన్న అమీన్పూర్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న సమన్నత లక్ష్యంతో మూడు భారీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని, పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News