జూలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో అన్ని వర్గాలకు సమ న్యాయం పాటిస్తున్నదని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని డీఎంఎఫ్‌టీ, సీడీపీ నిధుల ద్వారా రూ.10 లక్షల నూతనంగా నిర్మించిన నాయీబ్రా హ్మణ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీపీ రమా దేవి రాంగోపాల్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్‌లు వేణుగోపాల్, వెంకటయ్య, మండల అధ్యక్షుడు కంది చొక్కారెడ్డి, వైస్‌ఎంపీపీ మొగురం రమేష్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నర్సింగం, అనుబంధ సంఘాల అధ్యక్షులు కుంట రాజేశ్వర్‌రెడ్డి, తమ్మడవేని మల్లేశం, కత్తెర్ల శ్రీనివాస్, కరాటే లక్ష్మణ్, ఎంపీటీసీ మమత ప్రదీప్, వెంకటేశం, మాజీ సర్పంచ్ రవి, గ్రామశాఖ అధ్యక్షుడు పొలగాని సతీష్, నాయీబ్రాహ్మణ సంఘం పెద్దలు రాంచంద్రం, స్వామి, వేణు, చంద్రమోహన్, శంకరయ్య, వంశీ, రమేష్, బీఆర్‌ఎస్ ప్ర జాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.