Monday, December 23, 2024

సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

జూలపల్లి: మండలంలోని కీచులాటపల్లి గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. శుక్రవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.

సీడీపీ నిధులు రూ.4 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో నిధులు ఖర్చు చేస్తున్నారని అన్నారు. కులవృత్తులకు ప్రత్యేక నిధులు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలతో పాటు గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మహనీయడని కొనియాడారు.

మరోమారు ఆయనకు మద్ధతుగా నిలబడి మరింత అభివృద్ధిని చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ రమాదేవి రాంగోపాల్ రెడ్డి, మండల పార్టీ గౌరవ అధ్యక్షుడు కంది చొక్కారెడ్డి, వైస్‌ఎంపీపీ మొగురం రమేష్, అనుబంధ సంఘాల అధ్యక్షుడు తమ్మడవేని మల్లేశం, కత్తెర్ల శ్రీనివాస్, కరాటే లక్ష్మణ్, సర్పంచ్ శకుంతల రవి, ఉప సర్పంచ్ అడువాల తిరుపతి, మాజీ ఎంపీటీసీ ఎర్రోళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News