Friday, November 22, 2024

క్రికెట్ అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

హెచ్‌సిఎ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
మన తెలంగాణ/ హైదరాబాద్: పాఠశాల స్థాయి నుంచే క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు పేర్కొన్నారు. వర్ధమాన క్రికెటర్లలోని ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఆగస్టు 5 నుంచి హెచ్‌సిఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్స్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. కీసరలోని స్టంప్స్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్లో గౌతం జూనియర్ కళాశాల (జీడిమెట్ల) 62 పరుగుల తేడాతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం) జట్టుపై విజయం సాధించింది. విజేత జట్టుకు హెచ్‌సిఎ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్ తదితరులు ట్రోఫీలను బహూకరించారు.

ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఇంటర్ స్కూల్స్ టోర్నీని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ టోర్నీలో 177 జట్లు పాల్గొన్నాయన్నారు. కుర్రాళ్లలోని ప్రతిభను బయటికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్‌లు దోహదం చేస్తాయన్నారు. ఏడాది పాటు వివిధ క్రికెట్ టోర్నీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గతంతో పోల్చితే హైదరాబాద్ క్రికెట్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. క్రికెట్ అభివృద్ధే ఏకైక లక్షంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి వారిని మరింత మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దేందుకు హెచ్‌సిఎ సిద్ధంగా ఉందని జగన్‌మోహన్ రావు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News