Saturday, December 21, 2024

ప్రతి నిమిషం సిద్దిపేట ప్రజల కోసం కష్టపడతా…

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ప్రతి నిమిషం సిద్దిపేట ప్రజల కోసం కష్టపడతానని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం చెర్ల అంకిరెడ్డి పల్లి గ్రామ ముదిరాజ్ లు బిఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని ముదిరాజ్ సంఘ ప్రతినిధులు మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం ఇది కెసిఆర్ వల్లనే సాధ్యం అయిందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఉంటే ఎన్నో కష్టాలు పడ్డామని అన్నారు.

ఇపుడు సిద్దిపేట జిల్లా అయింది. సిద్దిపేట కు మెడికల్ కళాశాల తోపాటు 1000 పడకల ఆస్పత్రి వచ్చిందని ఇటీవలే సిద్దిపేటకు రైల్ కూడా తెచ్చుకున్నామన్నారు. సిద్దిపేట వాళ్ళు అంటే వారి గౌరవం విలువ పెంచుడే తప్ప తగ్గించలేదన్నారు. సిద్దిపేట అధివృదితో ప్రజల్లో నాకు గౌరవం పెరిగిందని అన్నారు. పెద్ద వాగులో ఎండ కాలం కూడా నీళ్ళు ఉన్నాయ్ అంటే అది కెసిఆర్ వల్లనే సాధ్యం అయిందని అన్నారు. . జీవనాధారం లాంటి నీళ్ళు తెలంగాణలో ప్రతి మూలలో ఉన్నాయని తెలిపారు. సీఎం కెసిఆర్ రైతు విలువ పెంచి రైతు విలువతో భూమి విలువ పెరిగిందన్నారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో భాగం అవుదామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News