Friday, December 20, 2024

హుజూర్‌నగర్ అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధికి శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్ మండల పరిధిలోని అమరవరంలో రూ. 96లక్షల వ్యయంతో నిర్మాణాలు చేపట్టిన వంతెనపనులకు ఆయన శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాదిరూపాయాలతో నియోజకవర్గంలోని మారుమూల పల్లెలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

తాను ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం జరుగుతుందన్నా రు. నియోజకవర్గంలోని పంటపొలాలకు సంబంధించి 7 వంతెనలు మ ంజూరీ చేయించడం జరిగిందని, నాలుగు నెలల్లో వంతెనల నిర్మాణం పూర్తవుతుందన్నారు. నిరంతరం నియోజకవర్గంలోని ప్రజల కోసమే పనిచేస్తున్నామన్నారు.

ప్రజలందరికీ మౌళిక సదుపాయాల కల్పనే లక్షం అ న్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ అన్నెం శౌరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ముడెం గోపిరెడ్డి, కడియం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News