Wednesday, January 22, 2025

శరవేగంగా నెల్లూరు రైల్వే స్టేషన్ విస్తరణ పనులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలోని గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉన్న నెల్లూరు రైల్వే స్టేషన్ విస్తరణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు వినియోగదారుల అవసరాలను తీర్చడానికి, సొగసైన ఫీచర్లతో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి ఈ పిసి విధానంలో దక్షిణ మధ్య రైల్వే ద్వారా ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పిసి విధానంలో మెసర్స్ ఎస్‌సీఎల్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ హైదరాబాద్ వారికి స్టేషన్ పునరాభివృద్ధి పనులను ఇచ్చారు. అంతే కాకుండా దీనిని 21 నెలల కాల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగముగా పశ్చిమం వైపు కొత్త భవనాన్ని నిర్మిస్తుండగా, తూర్పు, ఉత్తరం వైపున ఉన్న భవనాలను రైలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పొడిగిస్తున్నారు. దానితో పాటు, భవనాల పునరుద్ధరణ , ముఖభాగాల మెరుగుదలలు కూడా చేపడుతున్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన పనుల్లో ..

మొదటి దశలో భాగముగా సైట్ కార్యాలయాల ఏర్పాటు, కాంక్రీట్ టెస్టింగ్ ల్యాబ్, మెటీరియల్‌లను పేర్చడానికి నిల్వ షెడ్‌లు, రైల్వేకోర్టు , గవర్నమెంట్ పోలీస్ వారి కార్యాలయాల కొరకు తాత్కాలిక షెడ్‌ల నిర్మాణం పూర్తయింది. అన్ని భవనాల్లో పునాదులు, పిల్లర్ల నిర్మాణం కూడా పూర్తయింది. తూర్పు వైపు భవనంలో గ్రౌండ్ ఫ్లోర్, 1వ అంతస్తు 2వ అంతస్తు రూఫ్ స్లాబ్‌ల కాంక్రీటింగ్ పూర్తి కాగా, 2వ అంతస్తు స్లాబ్‌కు షట్టరింగ్ సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. పడమర వైపు భవనంలో గ్రౌండ్ ఫ్లోర్, 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తుల పునాదులు రూఫ్ స్లాబ్‌ల కాంక్రీటింగ్ పూర్తి కాగా, 3వ అంతస్తుకు సెంట్రింగ్ షట్టరింగ్ పనులు పురోగతిలోఉన్నాయి. అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో (1 నుండి 4 వరకు) 36 మీటర్ల వెడల్పు గల ఎయిర్ కాన్కోర్స్ సంబంధిత నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిలో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నప్పుడు ఫౌండేషన్‌లు, స్తంభాలు గర్డర్‌లను ప్రారంభించడం కూడా పూర్తయింది.

ప్రస్తుతం సబ్‌వే నిర్మాణం పనులు 80శాతం పూర్తికాగా, ఇతర పనులు కొనసాగుతున్నాయి. కాగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ నెల్లూరు స్టేషన్ పునరాభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా అన్ని దశల్లో పనులు సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. రైలు వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకుని పనులు చేపట్టాలని ఎగ్జిక్యూటింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News