Saturday, September 14, 2024

మార్చి నాటికి దేవాదుల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై చేపట్టిన దేవాదుల సాగునీటి ఎత్తిపోతల పథకం ని ర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చినాటికి అన్నివిధాలా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. అందు కు తగ్గట్టుగానే ప్రభుత్వం నీటి శాఖలో నిర్మాణంలో ఉన్నప్రాజెక్టుల్లో ఎంపిక చేసుకున్న ప్రాధాన్యత ప్రాజెక్టుల క్రమంలో దేవాదుల ఎ త్తిపోతల పథకం తొలివరసలోనే ఉంది. ఈ ప్రాజెక్టు ల పెండింగ్ పనులకు అవసరమైన నిధులు కూడా కేటాయించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు కు నీరు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు నీటి పారుదల పనులను వేగవంతం చే సింది.

మొత్తం మూడు దశల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రణాళికతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే సేకరణతో సహా 91శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేసి 2025 మార్చి నాటికి 89 వేల 312 ఎకారాల కొత్త ఆయాకట్టుకు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2004 – 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6016 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టును కాలక్రమంలో ఫేజ్-2, ఫేజ్-3 లుగా విస్తరించడంతో అంచనా వ్యయం 17వేల 500 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు 14 వేల 188 కోట్ల ఖర్చు తో ప్రాజెక్టు నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం భూ 33 వేల 224 ఎకరాలుగా తరువాయి 12లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News