Sunday, December 22, 2024

ఇక శరవేగంగా త్రిబుల్ ఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: డిసెంబర్‌లోగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి (ఎన్ హెచ్65) విస్తరణ పనులు పూర్తయ్యేలా చూస్తామ ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రహదారులపై సమీక్ష అ నంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాం గ్రెస్ హయాంలోనే రాష్ట్రానికి ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు వచ్చాయని తెలిపారు.నల్గొండ బైపా స్ రోడ్డు గురించి కేంద్ర మంత్రి గడ్కరీ తో చర్చిం చా. ఆర్‌ఆర్‌ఆర్‌ను కెసిఆర్ ప్రభుత్వం ప ట్టించుకోలేదని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. యు టిలిటీ ఛార్జీలు భరించేందుకు బిఆర్‌ఎస్ ప్రభు త్వం ఇష్టపడలేదని, దీంతో ఆ ప్రాజెక్టు కొంతకాలం ఆగిందన్నారు.

యుటిలిటీ ఛార్జీలు భరిస్తామని తాము చె ప్పడంతో మళ్లీ కదలిక వచ్చిందని, ఈసారి రీజినల్ రింగ్ రోడ్డుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. నాగ్‌పూర్ మంచిర్యాల హైవే నిర్మాణం పై కూడా కేంద్రంతో చర్చించామ ని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడక సాగడంపై మం త్రి ఆరా తీశారు. కాంట్రాక్టర్ వల్లనే ఈ పరిస్థితి వ చ్చిందని అధికారులు చెప్పగా ఈ అంశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లి కాంట్రాక్టరును మార్చడం లేదా పనులు వేగవంతం చేయించాలని అధికారులకు సూచించారు. అంబర్‌పేట ఫ్లై ఓవర్ పనులు తుది దశకు చేరాయని, మరో నెల రోజుల్లో ట్రాఫిక్‌కు అనుమతి ఇస్తామని అధికారులు మంత్రికి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News