Tuesday, January 21, 2025

విదేశీ ఉద్యోగ అవకాశాలపై వర్క్‌షాప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విదేశీ ఉద్యోగ అవకాశాలపై గాంధీ మెడికల్ కళాశాలలో టామ్ కామ్ ప్రత్యేక వర్క్ షాప్‌ను నిర్వహించింది. తెలంగాణ ఆరోగ్యశాఖ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో హెల్త్ కేర్ రంగంలో ఓవర్సిస్ నర్సింగ్ ఉద్యోగ అవకాశాలపై తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ( టామ్ కామ్ ) ఆధ్వర్యంలో బుధవారం నాడు గాంధీ మెడికల్ కాలేజీలీలో నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌ను కార్మిక ఉపాధి మరియు శిక్షణ శాఖ కమిషనర్ నదీమ్ అహ్మద్ ఐఎఎస్ సమక్షంలో కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుమిదిని ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు.

తెలంగాణ నుండి అర్హత కలిగిన యువతకు ఆరోగ్య సంరక్షణ రంగంలో విదేశీ ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన పెండచం, వలసల యొక్క సరక్షితమైన న్యాయమైన మరియు నైతిక మార్గాల ద్వారా వారి నియామకాలను సులభతరం చేయడంపై అధికారులు ఈ సమావేశంలో చర్చించారు.ముఖ్యంగా జపాన్, కెనడా, యుఏఈ, ఆస్ట్రేలియా యూకే జర్మనీ ఇతర యురోపియన్ దేశాల వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలలో నర్సులు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ కార్మికులకు పెద్ద డిమాండ్ ఉండడంతో సుమారు వెయ్యి మందికి పైగా నర్సులు మరియు ఇతర పారామెడికల్ సిబ్బంది వర్క్‌షాప్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఈ సందర్భంగా తమ సందేహాలను నివృత్తి చేశారు.

కాగా ఈ ఈవెంట్‌లో భాగంగా ఈ దేశాల్లో ఉపాధి అవకాశాలను ప్రదర్శించే 12 దేశాల వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆసక్తిగల అభ్యర్థులకు అర్హత ప్రమాణాలు, అర్హత పరీక్షలు మరియు నియామక ప్రక్రియల గురించి సమాచారాన్ని అందించారు. ముఖ్యంగా యూఎస్‌ఏ మరియు కెనడా శిక్షణా కార్యక్రమాల కోసం అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించారు. ఇందులో 403 మంది నర్సులు పాల్గొన్నారు. మరో వంద మంది నర్సులు జపాన్ కోసం స్క్రీనింగ్ పరీక్షలో పాల్గొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి టామ్ కామ్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్న విషయం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News