Monday, December 23, 2024

గడ్డి క్షేత్ర నిర్వహణపై వర్క్‌షాప్

- Advertisement -
- Advertisement -

మన్ననూర్ : మన్న నూర్ సిబిఈటి ఆవరణలో సోమ వా రం గడ్డి క్షేత్ర వర్క్ షాప్ నిర్వహిం చా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా గ్రాస్ మ్యాన్ ఆఫ్ ఇండియా ని పుణుడు డాక్టర్ మురత్కర్ పాల్గొని గడ్డి క్షేత్రాల గురించి, గడ్డి పెంపకం గురించి సిబ్బందికి వివరించారు. నేచురల్ టైగర్ సిబ్బందికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పర్యటనకు వ చ్చే పర్యాటకులకు అవగాహన ఇవ్వాలనే దానిపై శిక్షణ కల్పించారు. ఈ వర్క్ షాప్‌లో 80 మంది సి బ్బంది పాల్గొన్నారు. సిబిటి వర్క్ షాప్‌లో మూడు గంటల పాటు క్లాస్ నిర్వహించి అనంతరం రోడ్ల బండ పెంట, జిల్లాయకుంటలో ఏర్పాటు చేసిన గ్రాస్‌ల్యాండ్ మేనేజ్మెంట్ పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో పిసిసిఎఫ్, ఐఎఫ్‌ఎస్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ శివాని దొంగ్రే లోకేష్ జైస్వాల్, మహ బూబ్‌నగర్ సర్కిల్ ఇంచార్జి యాదగిరి, నాగర్‌కర్నూల్ సర్కిల్ ఇంచార్జి రోహిత్ గోపిడి, జిల్లా అటవి శాఖ అధికారులు, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ, వనపర్తి, వికారాబాద్, డిఎఫ్‌ఓలు రాజశేఖర్, సత్యనారాయణ, డిఎఫ్‌ఓ అధికారులు, ఎఫ్‌డిఓ శ్రీనివాస్, ఎఫ్‌ఎస్‌పి రేంజ్ అధికారులు ప్రభాకర్, ఈశ్వర్, ఆదిత్య, రాజేందర్, గురుప్రసాద్, మురళీధర్, వీరేంద్ర బాబు, రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు రవి కుమార్, బీట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News