Monday, December 23, 2024

మిషన్ ఇంధ్రదనస్సు 5 పై వర్క్‌షాప్

- Advertisement -
- Advertisement -

సుబేదారి: ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంధ్రదనస్సు . 5లో భాగంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకొని పాక్షికంగా వేయించుకున్న పిల్లలను గుర్తించి టీకాలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం కాన్షరెన్స్ హాలులో వైద్య అధికారులు, సూపర్‌వైజర్లకు మిషన్ ఇంధ్రదనస్సు. 5పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. హై రిస్క్ ఏరియా లైన్ సప్లై ఏరియాలు, ఇటుక బట్టీలు పెట్టే ప్రదేశాలు, సంచార జాతుల వారు, ఎక్కువగా టీకాలను మిస్సవుతారని, ఈనెల 14 నుంచి 20 వరకు ఆరోగ్య సిబ్బంది తమ పరిధిలో సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాలన్నారు.
ఆగస్టు 7 నుంచి 12, సెప్టెంబరు 11 నుంచి 16, అక్టోబరు 9 నుంచి 14, వారంలో 6 పని దినాల్లో ఈ ప్రత్యేక సెషన్లను నిర్వహించడం జరుగుతుందన్నారు. డబ్లూహెచ్‌ఓ సర్వే లైన్స్ వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ సర్వే విధానం, ఇమ్యునైజేషన్ సెషన్, ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇతర సాంకేతిక అంశాలపై శిక్షణ అందించారు. డీఐఓ డాక్టర్ సీహెచ్ గీతా లక్ష్మి శిక్షణ ఇస్తూ ఇక నుంచి పిల్లలు, గర్బిణీ స్త్రీలు యూవీఎన్ ఆప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, లేదా టీకాలు ఇచ్చే ఆరోగ్య సిబ్బంది వారి వివరాలను నమోదుచేస్తారని, ఇక నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
డిసెంబరు 2023 వరకు మిజిల్స్, రుబెల్లాను దేశం నుంచి పారదోలడానికి ఉపయోగపడుతుందన్నారు. లెఫ్ట్ ఓవర్, డ్రాప్ ఔట్స్ ప్రత్యేక సెషన్లు రెగ్యులర్ బుధవారం, శనివారం నిర్వహించే టీకా సెషన్లలో వేయించాలన్నారు. ఈనె 20న డీ వార్మింగ్ డే, ఈనెల 20న పిల్లల్లో నులి పురుగుల నిర్మూలన కోసం డీ వార్మింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రమం తప్పకుండా డీ వార్మింగ్ చేయడం వల్ల మట్టి ద్వారా పిల్లల్లో సంక్రమించే వ్యాధులు, 16 నుంచి 2.5కి తగ్గిందని కావున 1 నుంచి 19 ఏళ్ల పిల్లందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా ఇప్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, ఉప కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 1 నుంచి 2 ఏళ్ల వరకు సంగం మాత్ర, 2 నుంచి 3 ఏళ్ల వరకు 1 మాత్ర, 3 నుంచి 19 ఏళ్లు పూర్తి పూర్తి మాత్ర ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి. మదన్మోహన్‌రావు, జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యాకూబ్‌పాషా, జిల్లా సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, ఎస్‌ఓ ప్రసన్నకుమార్, డిప్యూటీ డెమో ప్రసాద్, రమేశ్, యువిన్ నుంచి శిరీష, రవీందర్, సిరాజ్, వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News