Saturday, October 5, 2024

త్రిపురలో పెరుగుతున్న హెచ్ఐవి కేసులు

- Advertisement -
- Advertisement -

ప్ర‌తిరోజూ 5 నుంచి 7 కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయన్న టిఎస్ఏసిఎస్‌

ప్ర‌స్తుతం రాష్ట్రంలో హెచ్ఐవీతో బాధ‌ప‌డుతున్న‌వారి సంఖ్య 5,674 

అగర్తలా: త్రిపుర‌లో హెచ్ఐవి క‌ల‌క‌లం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 47 మంది విద్యార్థులు హెచ్ఐవి బారినప‌డి మృతిచెందారు. మ‌రో 828 మంది విద్యార్థుల‌కు హెచ్ఐవి పాజిటివ్‌గా గుర్తించిన‌ట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టిఎస్ఏసిఎస్‌) సీనియర్ అధికారి భట్టాచార్జీ తెలిపారు.

ప్ర‌తిరోజూ 5 నుంచి 7 కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయని వెల్ల‌డించారు. రాష్ట్రంలో మొత్తంగా హెచ్ఐవితో బాధ‌ప‌డుతున్న‌వారి సంఖ్య 5,674గా ఉంద‌న్నారు. వీరిలో 4,570 మంది పురుషులు, 1,103 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండ‌ర్ ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. సంపన్న కుటుంబాల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నార‌ని తెలిపారు.

హెచ్ఐవి కేసుల పెరుగుద‌ల‌కు మాద‌క‌ద్ర‌వ్యాల దుర్వినియోగ‌మే కార‌ణ‌మ‌ని తెలిపారు. సంప‌న్న కుటుంబాల త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లు మాదకద్రవ్య వ్యసనానికి గురయ్యారని గ్రహించే సమయానికి… అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంద‌ని భట్టాచార్జీ వివ‌రించారు.  త్రిపుర జర్నలిస్ట్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, టిఎస్ఏసిఎస్ ఇటీవల సంయుక్తంగా నిర్వ‌హించిన‌ మీడియా వర్క్ షాప్‌లో ఈ పెరుగుతున్న కేసులు తెచ్చారు.

TSACS డేటా ప్రతిరోజూ ఐదు నుండి ఏడు కొత్త HIV కేసులు కనుగొనబడతాయని సూచిస్తుంది. మే 2024 నాటికి, త్రిపురలో 572 మంది విద్యార్థులతో సహా 5,674 మంది హెచ్‌ఐవి ఉన్నవారు సజీవంగా ఉన్నారు.

Tripura 2

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News