Thursday, December 26, 2024

సూదులతో వైద్యం… వ్యాధుల తగ్గుముఖం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ‘-టాపా’- ఆధ్వర్యంలో ఈ నెల 24 వ తేదీ ఆదివారం హైదరాబాదులో వరల్డ్ ఆక్యుపంక్చర్స్ డే సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ ఉత్సవాలు అనేక రకాలుగా ప్రాధా న్యం సంతరించుకున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆక్యుపంక్చర్ వైద్యాన్ని ఇండిపెండెంట్ థెరపీగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయడంతో ఒకసారిగా ప్రత్యామ్నాయ వైద్య రంగంలో కదలికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆక్యుపంక్చర్ వైద్యవిధానం ప్రపంచ స్థాయిలో అలోపతి వైద్యం తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన 108 విధానాల్లో ఇదొకటి. దాదాపు 110 దేశాల్లో ఆక్యుపంక్చర్ వైద్యం అమలులో ఉంది. ప్రజల మన్నలను పొందుతున్నది. ఆక్యుపంక్చర్ విధానంలోని ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ థెరపిలో ఔషధాలు ఉండవు.ఇది మందులేని చికిత్సా విధానం. అందువల్ల ఇప్పటికే అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అనేక దేశాల్లో తలెత్తుతున్న అనారోగ్య సవాళ్లకు ఇదొక చక్కని ప్రత్యాయమార్గంగా నిలుస్తున్నది.

అలాగే ఈ విధానంలో స్కానింగ్, ఎమ్మారై వంటి లేబరేటరీ టెస్టులు కూడా ఉండవు. దీనివల్ల వైద్యం ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి. అంటే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ జనబాహుల్యానికి వైద్యం అందించడానికి అవకాశం కలుగుతున్నది. ఇంకొక విషయం ఈ విధానంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు.

మన దేశంలో విధానాన్ని అనేక పేర్లతో పిలుస్తున్నారు. మర్మ చికిత్స అని, సూచి వైద్యం అని ఇలా అనేక పేర్లు ఉన్నాయి. ఈ వైద్య విధానాన్ని చైనా చాలా వరకు అభివృద్ధి పరిచింది. దీనికి సంబంధించిన లిటరేచర్‌ని కూడా చైనానే అభివృద్ధి పరిచింది. తర్వాత అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలు ఈ విధానాన్ని గుర్తించి అమలు చేయడంలో చైనా పాత్ర కీలకం. అయితే ఈ వైద్యం మూలాలు మన దేశంలో కూడా ఉన్నాయనేది నిజం. ఇప్పుడు మన దేశంలో ఈ వైద్యానికి సంబంధించి నూతన శకం ప్రారంభం అయింది. కేంద్రస్థాయిలో మెడికల్ కౌన్సిల్ డెంటల్ కౌన్సిల్ సలహాలు ఆక్యుపంచర్ కౌన్సిల్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది.

ఈ తరహా లోనే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆక్యుపంక్చర్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. దీని ద్వారా వివిధ పద్ధతుల్లో వివిధ స్థాయిల్లో ఉన్న ఆక్యుపంక్చర్ వైద్యం ఉన్నత ప్రమాణాలను సంతరించుకుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన నిబంధనలను అనుసరించి వైద్యం మెరుగైన పద్ధతిని అందుకుంటుంది. దీని వల్ల అతి తక్కువ ఖర్చుతో ప్రజా బాహుళ్యానికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. చికిత్స కన్నా నివారణ ముఖ్యమనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం సఫలం కావడానికి మార్గం సుగమం అవుతుంది. ఆక్యుపంక్చర్, కలర్ థెరపీ ఆక్యుప్రెషర్, సుజోక్, కప్పింగ్ తెరపి వంటి అనేక విధానాలు మరింత మెరుగైన పద్ధతిలో ప్రమాణాలను పెంచుకొని వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల భారం దీనివల్ల తగ్గుతుందని చెప్పవచ్చు.
అనేక సవాళ్లకు..

ఆక్యుపంక్చర్ అనేక అనారోగ్య సమస్యల్లో మెరుగైన ఫలితాలు అందిస్తున్నది. డైజెస్టివ్ సిస్టం, రెస్పిరేటరీ సిస్టం, నర్వ సిస్టం, రిప్రొడక్టివ్ సిస్టం వంటి వాటితో పాటు చర్మవ్యాధులు మానసిక సంబంధ సమస్యలకు సైతం సమర్ధంగా చికిత్స అందించగలుగుతున్నది. డిప్రెషన్, మైగ్రేన్, నీపెయిన్స్, సయాటికా, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యల్లో కూడా మెరుగైన ఫలితాలు కనబరుస్తున్నాయి. అక్యూట్ కండిషన్స్‌లో ఉన్న జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, గాయాలు, రక్తస్రావాలు వంటి విషయాల్లో కూడా ఆక్యుపంచర్ థెరపీ అద్భుత ఫలితాలను ఇస్తున్నది. ఈ కారణాల వల్లనే ఇప్పుడు ఆక్యుపంక్చర్ విధానానికి ఆదరణ క్రమంగా పెరుగుతున్నది.

ఆక్యుపంక్చర్ వైద్యానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ వైద్యం పునాదులు ఐదువేల సంవత్సరాల క్రితమే ఉన్నాయని చెబుతారు. ఈ వైద్య విధానాన్ని చైనా అద్భుతస్థాయిలో తీర్చిదిద్దింది. అత్యున్నత ప్రమాణాలతో ఒక స్థాయిని కల్పించింది. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ వైద్య విధానానికి మూలాధారమైన అంశం ఫైవ్ ఎలిమెంటల్ ఎనర్జీస్.. అంటే పంచభూత శక్తులు. అవి ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు ఈ విశ్వమంతా ఈ శక్తులతోనే ఏర్పడింది. అలాగే మన శరీరం కూడా పంచభూతాత్మకమే. అందువల్లనే మన శరీరాన్ని మీనియేచర్ ఆఫ్ ద నేచర్ అంటారు. ఈ మూల సూత్రం ఆధారంగానే ఆక్యుపంక్చర్ ప్రధానంగా పని చేస్తున్నది. ఉదాహరణకు ఒక ఎలిమెంటల్ ఎనర్జీ -ఫైర్- ఎనర్జీ అసమతుల్యానికి గురైనప్పుడు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇతర మూలకాల అనుసరించి మరికొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దీన్ని ఆధారం చూసుకునే ప్రకృతిని శరీరాన్ని ఏకం చేస్తూ నిజమైన ప్రకృతి వైద్యంగా అంటే మ్యాచురోపతిగా ఆక్యుపంక్చర్ విరాజిల్లుతున్నది.

నీడిల్ తో ప్రేరణ

శరీరంలోని నిర్దేశిత భాగంలో చిన్న సన్నని నీడిల్‌తో ప్రేరేపితం చేయడం ద్వా రా శరీరంలోని శక్తిని విశ్వంలోని శక్తితో అనుసంధానం చేయడంతో పాటు సంతులనం చేయడానికి అవకాశం కలుగుతున్నది. శరీరంలో వ్యర్ధాలు పోగు పడటమే వ్యాధి అని ఆక్యుపంక్చర్ చెబుతున్నది. అందువల్ల ఈ నీడిల్ ద్వారా మర్మ బిందువులను స్టిములేట్ చేయడం ద్వారా శరీరంలోని వ్యర్ధాలు తొలగించబడతాయి. అలాగే ఈ విధానం ఆహారమే ఔషధం అని చెబుతున్నది దీని వల్ల ఏ అనారోగ్య సమస్యకు ఏ రకమైన ఆహారం అవసరమో రుచుల ద్వారా ఈ విధానం వివరిస్తుంది. మూడవ ముఖ్యమైన విషయం ఫిజికల్ యాక్టివిటీ.. దీనిపైన కూడా తగిన సలహాలు సూచనలు ఉంటాయి. అంటే మన ఆరోగ్యా న్ని లేదా అనారోగ్యాన్ని నిర్ణయించేవి ముఖ్యంగా మూడు అంశాలు.. అవి ఆ హారం అలవాట్లు ఆలోచనలు. ఈ వైద్య విధానం సమర్థమైంది. అత్యంత అద్భుతమైన మెరుగైన ఫలితాలను ఇస్తున్నది.

ఇప్పుడు అనేక కొత్త విధానాలు వస్తున్నాయి. ఇది తాగండి, అది తినండి అని చెప్తున్నాయి. కానీ వాటి ఎఫికసి నిర్ధారణ కావడానికి కొంత కాలం పడుతుంది. ఇలాంటి కాలపరీక్షకు ఆక్యుపంక్చర్ నిలబడింది.ఆక్యుపంక్చర్ వైద్యం వ్యాధులను ఎలా తగ్గిస్తుంది అనేది అనేక మందికి వచ్చే సందేహం. ఈ విధానంలో నిర్దేశిత ప్రాంతాలలో శరీరంలోని మర్మ బిందువులలో నీడిల్ ద్వారా ప్రేరేపితం చేయడం వల్ల అంతర్గతంగా ఉన్న వైద్యుడు అంటే ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది. దాంతో అప్పటి దాకా ఉన్న రోగాలను తగ్గించుకోవడానికి వీలవుతుంది. కొత్తగా వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి అవకాశం కలుగుతుంది.

జనార్దన్ కాపర్తి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News