Thursday, January 23, 2025

ఎయిడ్స్ రహీత సమాజానికి కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

 

వాంకిడిః ఎయిడ్స్ రహీత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాతీయ సేవ పథకం ఎన్‌ఎస్‌ఎస్ పివో చంద్రయ్య అన్నారు. ఎయిడ్స్ ప్రపంచం దినోత్సవాన్ని పురస్కారించుకోని గురువారం వాంకిడి మండల కేంద్రంలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బస్టాండ్ వరకు ప్రధాన రోడ్డు గుండా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేటి యువత మంచి ఆలవాట్లు కలిగి ఉండాలని, ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కోసం, వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రన్సిపాల్ సంపత్‌కుమార్, అద్యాపకులు సురేందర్‌కుమార్, సంతోష్‌కుమార్, రాజమౌళి, శ్రీధర్, కిరణ్‌కుమార్, తిరుపతి, సంతోష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News