27మందితో బరిలోకి భారత్, గాయంతో సింధు దూరం
పతకాలపై ఆశలు రేపుతున్న లక్షసేన్, శ్రీకాంత్
టోక్యో : నేటి నుంచి జపాన్ వేదికగా బీడబ్లూఎఫ్ 2022 ప్రారంభం కానుంది. జపాన్ రాజధాని టోక్యో వేదికగా 27వ ప్రపంచ పోరు జరగనుంది. ఈ నుంచి 28వరకు బీడబ్లూఎఫ్ టోర్నీ నిర్వహించనున్నారు. 45ఏళ్ల జపాన్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిన్‌కు ఆతిథ్యం ఇస్తోంది. టోక్యోలోని మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. 5వేర్వేరు ఈవెంట్లలో జరిగే పోరులో 46దేశాలకు చెందిన 364మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. సోమవారం నుంచి జరిగే ఈ టోర్నీలో భారత్ తరఫున 27మంది బరిలోకి దిగనున్నారు. వీరిలో ఏడుగురు సింగిల్స్‌లో, పది డబుల్స్ జటుల్లో పోటీపడనున్నారు. బర్మింగ్‌హామ్‌లో అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన భారత ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనున్నారు. గాయంతో సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది. అయితే కామన్వెల్త్ స్వర్ణపతకంతో సత్తా చాటిన లక్షసేన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సేన్‌తోపాటు కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్, సైనానెహ్వాల్ తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు.
మరోవైపు ఈ మాసారంభంలో కామన్‌వెల్త్ గేమ్స్ డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి జోడీ పసిడి పతకం సాధించి భారత్ అభిమానుల ఆశలు పెంచారు. 2011నుంచి ప్రతి ఎడిషన్‌లో భారత ఆటగాళ్లు నిరాశ పరచకుండా పతకాలను సాధిస్తున్నారు. గతేడాది స్పెయిన్ వేదికగా జరిగిన ప్రపంచ 2021లో తెలుగుతేజం శ్రీకాంత్ రజత పతకం సాధించగా లక్షసేన్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది వీరికి మరింత పోటీ ఎదురుకానుంది. 2021లో జపాన్ స్టార్ కెంటో మొమొట, ఇండోనేసియా జోడీ జోనాథన్ క్రిస్టీ, ఆంథోనీ గింటింగ్ దూరమయ్యారు. కానీ ఈ ఏడాది వీరు బరిలోకి దిగుతుండటంతో భారత పోటీ తీవ్రం కానుంది. 1983 నుంచి భారత్ ఆటగాళ్లు ప్రపంచ సాధించిన పతకాల సంఖ్య చేరింది. భారత చరిత్రలో ప్రపంచ రజతం సాధించిన తొలి భారత షట్లర్‌గా శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు. సింధు క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ తైజుయింగ్ చేతిలో ఓటమిపాలై నిరాశపరిచింది. ఈ ఏడాది గాయంతో టోర్నీకి దూరమైంది.