Sunday, December 22, 2024

భారత్ ఆర్థిక వృద్ధిని 7 శాతానికి సవరించిన ప్రపంచ బ్యాంక్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ డిసి: భారత స్థూల జాతీయోత్పత్తి(జిడిపి)ని ప్రపంచ బ్యాంక్ సవరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. గతంలో 6.6 శాతం ఉండొచ్చని అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు తాజాగా తన అంచనాను మార్చుకుంది. వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడ్డంతో ఈ అంచనా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ భౌగోలిక రాజకీయ సవాళ్లున్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ రాణిస్తుందని పేర్కొంది.

ఇటీవలి ఆర్ బిఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశంలో భారత్ తొలి త్రైమాసికంలో 7.1 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా వేసింది. కాగా ప్రపంచ బ్యాంక్ భారత వృద్ధి 7 శాతం ఉండొచ్చని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News