Monday, December 23, 2024

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం..రక్తదానం చేసే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు..!

- Advertisement -
- Advertisement -

మీ రక్తంతో ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి వారి జీవితాన్ని కాపాడొచ్చు. అందుకే రక్తదానాన్ని గొప్ప దానం అని అంటారు. వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా..రక్తం లోపంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో రక్తదానం చేయబడుతుంది. రక్తదాన ప్రక్రియలో ఒక వ్యక్తి సాధారణంగా తన రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ లేదా అవసరమైన వారి కోసం రక్తాన్ని సేకరించే సంస్థకు దానం చేస్తాడు. ఈ నేపథ్యంలో రక్తదానంపై అవగాహన పెంచడం, రక్తదానం చేసేలా మరింత మందిని ప్రేరేపించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటాం.

అయితే, రక్తదానం చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానానికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఎవరు రక్తదానం చేయవచ్చు?

ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరు రక్తదానం చేయవచ్చు. అయితే, రక్తదానం చేయడానికి WHO ఇచ్చిన కొన్ని ప్రాథమిక మార్గదర్శకాలు ఇప్పుడు చూద్దాం.

1. మీ వయస్సు 18 నుండి 65 సంవత్సరాల మధ్య ఉంటే..మీరు రక్తదానం చేయడానికి అర్హులు.
2. రక్తదానం చేయడానికి మీ బరువు కనీసం 50 కిలోలు ఉండాలి.
3. రక్తదానం చేసేటప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. మీకు జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి, జలుబు, కడుపులో నులిపురుగులు లేదా మరేదైనా ఇన్ఫెక్షన్ ఉంటే రక్తదానం చేయకూడదు.

ఈ పరిస్థితుల్లో రక్తదానం చేయకూడదు

1. మీరు ఇటీవల టాటూ లేదా బాడీ పియర్సింగ్ చేయించుకున్నట్లయితే, రక్తదానం చేసిన తేదీ నుండి 6 నెలల వరకు రక్తదానం
చేయకూడదు.
2. ఏదైనా ప్రధాన చికిత్స తర్వాత ఒక నెల వేచి ఉండాలి.
3. రక్తదానం చేయడానికి కనీస హిమోగ్లోబిన్ స్థాయిని అందుకోకపోతే మీరు రక్తదానం చేయకూడదు.

ఇలాంటి వ్యక్తులు రక్తదానం చేయకూడదు

1. గత 12 నెలల్లో అనేక మంది వ్యక్తులతో అసురక్షిత లైంగిక చర్యలో నిమగ్నమై ఉన్నవారు.
2. హెచ్‌ఐవి (ఎయిడ్స్ వైరస్)కి పాజిటివ్‌గా ఉన్నవారు అర్హులు కాదు.
3. ఒక వ్యక్తి మందులు వాడితే రక్తదానం చేయకూడదు.
4. గర్భవతి, పిల్లలకు పాలు ఇస్తున్న మహిళలు, అబార్షన్ చేయించుకున్న మహిళలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News