Monday, December 23, 2024

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సస్పెండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికలను సకాలంలో నిర్వహించనందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్‌ఐ)ని ప్రపంచ రెజ్టింగ్ నిర్వహణా సంస్థ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యుడబ్లుబ్లు) సస్పెండ్ చేసింది. దీంతో రానున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లలో భారతీయ పతాకంపై భారతీయ రెజ్లర్లు పోటీచేసేందుకు అర్హత కోల్పోయారు.

డబ్లుఎఫ్‌ఐ కార్యవర్గ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన 45 రోజుల గడువును భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని తాత్కాలిక కమిటీ పాటించకపోవడంతో సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించేందుకు జరిగే ఒలింపిక్‌లో తటస్త అథ్లెట్స్‌గా భారతీయ రెజ్లర్లు పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏప్రిల్ 27న తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది. కాగా 45 రోజుల్లోపల ఎన్నికలను నిర్వహించాలని యుడబ్లుడబ్లు ఆదేశించగా తాత్కాలిక కమిటీ ఆదేశాలను పాటించలేకపోయింది. ఎన్నికలను నిర్వహించడానికి ఇచ్చిన గడువును పాటించని పక్షంలో భారతీయ రెజ్లింగ్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తామని యుడబ్లుబ్లు ఏప్రిల్ 28న హెచ్చరించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించని కారణంగా డబ్లుఎఫ్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు యుడబ్లుబ్లు బుధవారం రాత్రి తాత్కాలిక కమిటీకి తెలియచేసింది. నిజానికి మే 7న డబ్లుఎఫ్‌ఐ కార్యవర్గానికి ఎన్నికలు జరగవలసి ఉండగా ఈ ప్రక్రియను అక్రమమంటూ క్రీడా శాఖ నిలిపివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News