మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియ్‌షిప్
న్యూ ఢిల్లీ : మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ రెండు సిల్వర్ పతకాలు ఖాయమయ్యాయి. గురువారం జరిగిన సమీఫైనల్లో భారత బాక్సర్లు నీతూ ఘంగాస్, నిఖత్ జరీన్‌లో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లారు. 48 కేజీల విభాగం కామన్‌వెల్త్ గేమ్ప్ ఛాంపియన్ నీతూ కజకిస్తాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాపై విజయంబ సాధించగా.. 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ కొలంబియా బాక్సర్ ఇంగ్రిడ్ వెలిన్సియాను ఓడించింది. ఇక ఈ పోటీల్లో భారత్‌కు మరో రెండు పతాకాలు కూడా ఖాయం కానున్నాయి.
బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) విజయాలు సాధించి కనీసం కాంస్యం పతాకన్ని ఖరారు చేశారు. ఇవాళ రాత్రి 8:15 గంటలకు జరిగే సెమీఫైనల్లో లవ్లీనా.. లీ కియాన్ (చైనా)ను, రాత్రి 8: 30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సావీటీ.. సూ ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా)తో తలపడనున్నారు. ఈ బౌట్‌లలో వీరిరువురు విజయాలు సాధిస్తే, భారత్‌కు మరో 2 రజత పతకాలు ఖాయమవుతాయి.