Friday, November 22, 2024

రెండో రోజూ కూడా నిరాశే..

- Advertisement -
- Advertisement -

World champion test stopped due to rain

సౌతాంప్టన్ : భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసిసి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరానికి శనివారం రెండో రోజు కూడా ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది. వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఆటను పలుసార్లు నిలిపి వేయాల్సి వచ్చింది. శుక్రవారం తొలి భారీ వర్షం వల్ల కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇక శనివారం వర్షం పడక పోవడంతో నిర్ణీత సమయంలోనే ఆట ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎం చుకుంది. ఇక టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రోహిత్ ఆరు ఫోర్లతో 34 పరుగులు చేశాడు. అయితే కుదురుగా ఆడుతున్న రోహిత్‌ను జేమిసన్ పెవిలియన్ పంపించాడు. దీంతో 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఔటయ్యాడు. 3 ఫోర్ల తో 28 పరుగులు చేసిన గిల్‌ను వాగ్నర్ వెనక్కి పంపాడు. ఈ దశలో కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యత తనపై వేసుకున్నాడు. మరోవైపు చటేశ్వర్ పుజారా 54 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కానీ తర్వాత వచ్చిన వైస్ కెప్టెన్ రహానెతో కలిసి కోహ్లి స్కోరును ముందుకు నడిపించాడు. కాగా భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు ఉన్న సమయంలో ప్రతికూల వాతావరణం వల్ల మ్యాచ్‌ను నిలపి వేశారు. అప్పటికీ కోహ్లి (44), రహానె (29) పరుగులతో క్రీజులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News