Monday, December 23, 2024

ఆరో వికెట్ డౌన్.. కష్టాల్లో సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతు సెమీ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లకు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపెడుతున్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీ బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 30.5 ఓవర్లలో 119 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ బవుమా(0), ఓపెనర్ డికాక్(3), డస్సెన్(6), మార్ క్రమ్(10), మార్క్ జాన్సెన్(0)లు ఘోరంగా విఫలమయ్యారు.

ఈ క్రమంలో క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ల జోడీ కోద్దిసేపు ఆసీస్ బౌలర్ల జోరును అడ్డుకుంది. ఇద్దరూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, 47 పరుగుల వ్యక్తి స్కోరు వద్ద క్లాసెన్ ఔట్ కాగా.. మిల్లర్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 32 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.  క్రీజులో డేవిడ్ మిల్లర్(53), గెరాల్డ్ కోయెట్జీ(1)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News