Sunday, January 19, 2025

సెంచరీతో రాణించిన డేవిడ్ మిల్లర్.. ఆస్ట్రేలియా టార్గెట్ 213

- Advertisement -
- Advertisement -

వన్డే ప్రపంచ కప్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైన్ ల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్టుకు 213 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.

తోటి ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టిన దశలో.. తానున్నానంటూ డేవిడ్ మిల్లర్ సెంచరీతో చెలరేగి జట్టు పరువు కాపాడాడు.116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో మిల్లర్ 101 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కెప్టెన్ బవుమా(0), ఓపెనర్ డికాక్(3), డస్సెన్(6), మార్ క్రమ్(10), మార్క్ జాన్సెన్(0)లు ఘోరంగా విఫలం కాగా… క్లాసెన్ 47 పరుగులతో రాణించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News