Friday, December 20, 2024

World Cup 2023: చెలరేగిన జద్రాన్, రషీద్.. ఆసీస్ టార్గెట్ 292

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘానిస్థాన్ జట్టు, ఆస్ట్రేలియాకు 292 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆఫ్ఘాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అజేయ శతకంతో చెలరేగాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 129 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక, చివరల్లో రషీద్ ఖాన్.. టీ20 మ్యాచ్ తలపించేలా భారీ షాట్ లతో అలరించాడు. కేవలం 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 35 పరుగులు చేశాడు.

మిగతా బ్యాట్స్ మెన్లలో రహ్మానుల్లా గుర్బాజ్ 21 పరుగులు, రహ్మత్ షా 30 పరుగులు, హష్మతుల్లా షాహిదీ 26 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 22 పరుగులు చేశారుజ దీంతో ఆఫ్ఘాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 291 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో హజల్ హుడ్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, మాక్స్ వెల్, ఆడమ్ జంపాలు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News