Sunday, January 19, 2025

World Cup 2023: పాక్పై ఆస్ట్రేలియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్, ఇమామ్ ఉల్ హక్ శుభారంభం అందించారు. షఫిక్ (64), హక్ (70) పరుగులు చేశారు.

కెప్టెన్ ఆజమ్ (18) పరుగులు చేశాడు. వికెట్ కీపర్ రిజ్వాన్ (46), సౌద్ షకిల్ (30), ఇఫ్తికార్ అహ్మద్ (26) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు, స్టోయినిస్, కమిన్స్ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (163), మార్ష్ (121) శతకాలతో ఆదుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News