Sunday, January 19, 2025

ఆస్ట్రేలియాకు వరుసగా ఐదో విజయం.. ఇంగ్లండ్ కథ ముగిసింది

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఐదో విజయం సాధించింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 33 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 286 పరుగులకు ఆలైటైంది. లబుషేన్ (71), గ్రీన్ (47), స్మిత్ (44) రాణించారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 253 పరుగులకే కుప్పకూలింది. మలన్ (50), స్టోక్స్ (64), మోయిన్ (42) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కాగా, ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఆరో ఓటమి కావడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News