Sunday, January 19, 2025

బంగ్లాతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

పుణె: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం పుణెలో జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్‌ తలపడనుంది.మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు బంగ్లాదేశ్ వరుస ఓటములతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.

కనీసిం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలనే పట్టుదలతో బంగ్లాదేశ్ ఉంది. అయితే చివరి ఆరు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాదేశ్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పాలి. అఫ్గాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. గ్లెన్ మాక్స్‌వెల్ సాధించిన చారిత్రక అజేయ డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా అనూహ్య విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక బంగ్లాతో జరిగే మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News