Thursday, December 19, 2024

World Cup 2023: చివర్లో చెలరేగిన పాక్ బౌలర్లు.. ఆసీస్ 367/9

- Advertisement -
- Advertisement -

ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121)లు భారీ శతకాలతో విజృంభించారు. ఫోర్లు, సిక్సులతో చెలరేగడంతో ఓపెనర్లు ఇద్దరూ పాక్ బౌలర్లను ఉతికారేశారు. దీంతో తొలి వికెట్ కు 259 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు.

వీరి జోష్ చూస్తే ఓ దశలో ఆసీస్ 400 పరుగులు చేసేలా కనిపించింది. అయితే.. ఓపెనర్లు ఔట్ కావడంతో ఆసీస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మొదట చేతులెత్తేసిన పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి.. ఆసీస్ దూకుడుకు కళ్లెం వేశారు. ఓపెనర్లు తప్పా.. మిగతా ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. దీంతో ఆసీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News