Thursday, December 19, 2024

తొలి విజయం కోసం ఆస్ట్రేలియా-శ్రీలంక ఢీ..

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో సోమవారం ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఇరుజట్లు చెరో రెండు మ్యాచ్ లు ఆడగా.. రెండు టీమ్ లు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. దీంతో ఈరోజు జరుగనున్న మ్యాచ్ లో గెలిచి మెగా టోర్నీలో బోణీ కొట్టాలని ఆసీస్, లంక జట్లు పట్టుదలగా ఉన్నాయి.

అయితే, ఆసీస్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగానే ఉండగా.. లంక మాత్రం ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతోంది. ఇప్పటికే తొడ కండరాల గాయం కారణంగా కెప్టెన్ దసున్ షనక మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానంలో ఆల్‌రౌండర్ కరుణరత్నేతో జట్టులోకి తీసుకున్నారు. ఇక, ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ, కామెరిన్ గ్రీన్.

శ్రీలంక జట్టు: కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ (కీపర్), పాతుమ్ నిస్సంక, కుసల్ పెరీరా, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, మతీశ పతిరన, దిల్షన్ మధుశంక, లహిరు కుమార, కసున్ రజిత, చమీ కరుణరత్నే, దిముత్ కరుణరత్నే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News