- Advertisement -
లక్నో: వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 312 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ బ్యాట్స్ మెన్లు తడబడుతున్నారు.
సఫారీ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగడంతో 56 పరుగులకే ఓపెనర్లు మిచెల్ మార్ష్(7), డేవిడ్ వార్నర్(13), స్టీవ్ స్మిత్(19), జోష్ ఇంగ్లిస్(5)ల టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆసీస్ 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో లబుసేన్(4), గ్లెన్ మాక్స్ వెల్(3)లు ఉన్నారు.
That’s a gem of bowling
Kagiso Rabada is showing everyone his class#AUSvSA #AUSvsSA pic.twitter.com/3dzFaOJ0fw
— Pragati (@tech_pragati) October 12, 2023
- Advertisement -