ముంబయి: ప్రపంచకప్-2023 లీగ్ దశలో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఒంటరి పోరాటం చేసిన గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆసీస్ ను గెలిపించాడు. డబుల్ సెంచరీతో టీంను విజయతీరాలకు చేర్చాడు. 128 బంతుల్లో 201 పరుగులు చేసిన మ్యాక్సీ నాటౌట్ గా నిలిచాడు. మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ లో 10 సిక్సులు, 21 ఫోర్లు ఉన్నాయి.
91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశ నుంచి జట్టును మ్యాక్స్ వెల్ గెలిపించాడు. ఆస్ట్రేలియా తరుపున తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆరో స్థానంలో వచ్చి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మ్యాక్స్ వెల్ రికార్డు నెలకోల్పాడు. 33 పరుగుల వద్ద మ్యాక్సీ ఇచ్చిన సులువైన క్యాచ్ ను ముజీబ్ వదిలేశాడు. దీంతో ఆఫ్ఘాన్ బౌలర్లను మ్యాక్స్ పరుగులు పెట్టించాడు. ఈ విజయంతో ఆసీస్ సెమీల్ లో ఆడుగుపెట్టింది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా సెమీస్ చేరాయి.
సెమీస్ లో 4వ స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ పోటీలో ఉన్నాయి.
స్కోర్లు: అఫ్గానిస్థాన్ 291/5, ఆస్ట్రేలియా 293/7.