Sunday, January 19, 2025

World Cup 2023: నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లా..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాకు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ మొదటి బంతికే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో ఓపెనర్ లిటన్ దాస్ డకౌటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫర్గుసన్ బౌలింగ్ మరో ఓవర్ తన్జీత్ హసన్(12) పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హసన్ మిర్జా(30) ఫర్వాలేదనిపించినా, హొస్సెన్ షాంటో(07) నిరాశపర్చాడు. దీంతో బంగ్లా జట్టు 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలో కెప్టెన్ షికీబ్ అల్ హసన్ తో జత కలిసి ముష్ఫికర్ రహీమ్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వికెట్ ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ముష్ఫికర్ రహీమ్ అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం బంగ్లా 28 ఓవర్లలో 134 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో షికీబ్(24), ముష్ఫికర్ రహీమ్(52)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News