Thursday, January 23, 2025

World Cup 2023: ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లా..

- Advertisement -
- Advertisement -

పుణే: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెర్లు తంజిడ్ హసన్(51, 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు), లిట్టన్ దాస్(66, 82 బంతుల్లో 7ఫోర్లు) అర్థ శతకాలతో రాణించారు. అయితే, వీరిద్దరూ పెవిలియన్ చేరిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది.

స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకోవడంతో బంగ్లాదేశ్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం బంగ్లా జట్టు 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫీకర్ రహీమ్(32), మహ్మదుల్లా(5)లు ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్, శార్ధుల్ ఠాకూర్, సిరాజ్ లు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News