Friday, December 20, 2024

నేడు భారత్-కివీస్ సెమీఫైనల్.. హాజరుకానున్న స్టార్ సెలబ్రిటీస్..

- Advertisement -
- Advertisement -

వన్డే ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో తలపడేందుకు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. ముంబైలో చారిత్రక వాంఖడే స్టేడియంలో ఈరోజు(బుధవారం) జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం కోట్లమంది ఇండియన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ను చూసేందుకు సాదారణ క్రికెట్ అభిమానులే కాదు.. స్టార్ సెలబ్రిటీలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈరోజు జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ కు పలువురు సినీ స్టార్స్ హాజరు కానున్నారు. ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెహ్రామ్, సినీ ప్రముఖులు రజినీకాంత్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, నీతా అంబానీ, హార్దిక్ పాండ్యాలతోపాటు బీసీసీఐ తరఫున మరికొందరు గెస్టులు ఈ మ్యాచ్ కు హాజరుకానున్నారు. ఈ మ్యాచ్ కు హాజరుకావాలని బిసిసిఐ సెక్రటరీ జై షా ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

కాగా, లీగ్ దశలో టీమిండియా ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ గెలిచి జోరుమీదుంది. కివీస్ ఐదు విజయాలతో సెమీ బెర్త్‌ను దక్కించుకుంది. కిందటి ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఆతిథ్య భారత్ ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా.. సెమీస్‌లోనూ ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది. మరి కివీస్ ఓడించి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?.. లేక వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో మరోసారి కివీస్, ఇండియాకు షాక్ ఇస్తుందో చూడాలి. ఇక, ఈ మ్యాచ్ పై పెద్ద ఎత్తున బెట్టింగ్ లు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News