Sunday, January 19, 2025

విజృంభించిన లంక బౌలర్లు.. 156 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో లంక బౌలర్లు ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు లంక బౌలర్లు చుక్కలు చూపించారు.

లైన్ అండ్ లెంగ్త్ బంతులలతో లంక బౌలర్ల విజృంభించడంతో ఒక్క బ్యాట్స్ మన్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. వచ్చిన బ్యాట్స్ మెన్ ను వచ్చినట్లు పెవిలియన్ పంపించారు. ఈ క్రమంలో లంక బౌలర్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన బెన్ స్టోక్స్(43) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకోపోయాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News