Friday, December 20, 2024

World Cup 2023: చెలరేగుతున్న లంక బౌలర్లు..కష్టాల్లో ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపిన్ ఇంగ్లండ్-శ్రలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేపట్టింది. అయితే, లైన్ అండ్ లెంగ్త్ బంతులలతో శ్రీలంక బౌలర్ల చెలరేగడంతో ఇంగ్లండ్ 5 కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

జానీ బెయిర్ స్టో 30 పరుగులు, డేవిడ్ మలాన్ 28 పరుగులు, జో రూట్ 3 పరుగులు, జోస్ బట్లర్ 8 పరుగులు, లివింగ్ స్టన్ ఒక పరుగు చేసి పెవిలియన్ చేరారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్(17), మొయిన్ అలీ(0)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News