- Advertisement -
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఆతిథ్య టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ ఆట తీరు గతంలో ఆస్ట్రేలియా జోరును గుర్తు తెస్తోందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఇదే జోరును చివరి వరకు కొనసాగిస్తే మూడో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.
లంకపై భారత్ ఆటను పలువురు మాజీ క్రికెటర్లు కొనియాడారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న టీమిండియాను కట్టడి చేయడం ప్రత్యర్థి జట్లకు చాలా కష్టమైన అంశమని వారు పేర్కొంటున్నారు.
- Advertisement -