Thursday, January 23, 2025

కోహ్లీ ఔట్.. కష్టాల్లో టీమిండియా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గిల్(4) ఔటైన తర్వాత రోహిత్ శర్మ(47), శ్రేయస్ అయ్యర్(4)లు కూడా వెంటవెంటనే పెవిలియన్ చేరారు.అనంతరం క్రీజులోకి వచ్చిన కెఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న కోహ్లీ.. భారీ షాట్స్ ఆడకుండా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో 55 బంతులో నాలుగు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ(53)ని కమిన్స్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం టీమిందియా 28 ఓవర్లలో 146 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(0), కెఎల్ రాహుల్(36)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News