Thursday, December 19, 2024

టీమిండియాకు షాక్.. వెంటవెంటనే రోహిత్, శ్రేయస్ ఔట్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్(4)ను స్టార్క్ ఔట్ చేశాడు. ఇక దూకుడుగా బ్యాటింగ్ చేసిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ(47) అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు.

మాక్స్ వెల్ బౌలింగ్ లో భారీ షాట్ యత్నించి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(4)ను తర్వాతి ఓవర్ లోనే కమిన్స్ పెవిలియన్ కు పంపాడు. దీంతో భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం టీమిందియా 12 ఓవర్లలో 86 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(26), కెఎల్ రాహుల్(4)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News