Sunday, January 19, 2025

కివీస్ మ్యాచ్‌కు హార్దిక్ దూరం

- Advertisement -
- Advertisement -

పుణె: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు కోలుకోలేని షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్య గాయం బారిన పడ్డాడు. దీంతో అతను అర్ధాంతరంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. బంతిని ఆపే క్రమంలో హార్దిక్ కింద పడ్డాడు. ఈ క్రమంలో ఎడమకాలిపై బరువు పడింది. నొప్పి తీవ్రత అధికంగా ఉండడంతో హార్దిక్ పెవిలియన్‌కు వెళ్లక తప్పలేదు. ఆ తర్వాత హార్దిక్‌ను స్కానింగ్ కోసం తీసుకెళ్లారు.

స్కానింగ్‌ను పరీక్షించిన వైద్యులు కొంత విశ్రాంతి తప్పదని సూచించారు. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు హార్దిక్‌కు విశ్రాంతి కల్పించారు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. అయితే హార్దిక్ గాయం మాములుగానే ఉందని తర్వాత మ్యాచ్ నాటికి అతను జట్టుకు అందుబాటులో వస్తాడని బోర్డు వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News