Monday, December 23, 2024

వరల్డ్ కప్ సెమీఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

- Advertisement -
- Advertisement -

ముంబై: వన్డే ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో తలపడేందుకు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సిద్ధమ్యాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ దూసుకెళ్లాలని భారత్ పట్టుదలగా ఉంది.

లీగ్ దశలో టీమిండియా ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ గెలిచి జోరుమీదుంది. మరోవైపు కివీస్ ఐదు విజయాలతో సెమీఫైనల్ కు చేరుకుంది. కాగా, వన్డే ప్రపంచకప్ లో భారత్-కివీస్ జట్లు ఇప్పటివరకు 9 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ నాలుగు మ్యాచ్ లు గెలువగా.. కివీస్ 5 మ్యాచ్ లో విజయం సాధించింది. 2019లో జరిగిన ప్రపంచకప్ సెమీఫైన్ లోనూ కివీస్, భారత్ పై 18 పరుగుల తేడాతో గెలుపొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News