Sunday, January 19, 2025

గిల్, కోహ్లీ, శ్రేయస్ పెవిలియన్.. ఒత్తిడిలో భారత్

- Advertisement -
- Advertisement -

లక్నో: వరల్డ్ కప్‌లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్నమ్యాచ్‌లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(9)ను ఇంగ్లాండ్ బౌలర్ క్రిష్ వోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(0), శ్రేయస్ అయ్యర్(04)లు భారీ షాట్ ఆడేందుకు యత్నించి ఔటయ్యారు. దీంతో భారత్ 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(33), కెఎల్ రాహుల్(04)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News