ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు 259 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. మొదట నిలకడగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఓపెనర్లు క్రమంగా గేర్ మార్చి పాక్ బౌలర్లను ఉతికారేశారు. ఫోర్లు, సిక్సులతో చెలరేగడంతో పాక్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ 85 బంతుల్లో శతకం బాదగా.. మార్ష్ 100 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. సెంచరీల తర్వా మరింత దూకుడు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, భారీ షాట్ కు ప్రయత్నించి మార్ష్(121) ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్() డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 38 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్(139), స్టీవ్ స్మిత్(7)లు ఉన్నారు.