Friday, December 20, 2024

World Cup 2023: చెలరేగుతున్న లంక బౌలర్లు.. కష్టాల్లో నెదర్లాండ్స్

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రపంచకప్‌లో భాగంగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ కు ఆదిలో షాక్ తగిలింది. జట్టు స్కోరు 7 వద్ద ఓపెనర్ విక్రమ్ జిత్ సింగ్(4) ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మాక్స్ ఓడౌడ్(16)తోపాటు తేజా నిడమనూరు(9), కోలిన్ అకెర్‌మాన్(29), బాస్ డి లీడే(6)లు పెవిలియన్ కు చేరారు. దీంతో 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పో్యి నెదర్లాండ్స్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో స్కాట్ ఎడ్వర్డ్స్(2), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(1)లు ఉన్నారు. 19 ఓవర్ల ముగిసే సరికి నెదర్లాండ్స్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News