Wednesday, January 22, 2025

బంగ్లాదేశ్‌ చిత్తు.. కివీస్‌కు హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. శుక్రవారం ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. న్యూజిలాండ్‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం కావడం విశేషం. ఇక బంగ్లాదేశ్ కు ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఒక దశలో 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లానే కెప్టెన్ షకిబ్ అల్ హసన్, వికెట్ కీపర్ ముష్ఫికుర్ రహీం ఆదుకున్నారు.

షకిబ్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. రహీం ఆరు బౌండరీలు, రెండు సిక్స్‌లతో 66 పరుగులు సాధించాడు. చివర్లలో మహ్మదుల్లా 41 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో బంగ్లా స్కోరు 245 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 42.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ డెవోన్ కాన్వే (45) పరుగులు చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (78౦, డారిల్ మిఛెల్ 89 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News