Friday, December 20, 2024

World Cup 2023: నేడు అఫ్గాన్‌తో కివీస్ ఢీ..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం చెన్నైలో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. కివీస్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో అజేయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో అఫ్గాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. కివీస్‌తో జరిగే మ్యాచ్‌లోనూ విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది.

అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న కివీస్ ఓడించడం అఫ్గాన్‌కు అనుకున్నం తేలిక కాదనే చెప్పాలి. కాన్వే, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, డారిల్ మిఛెల్, కెప్టెన్ టామ్ లాథమ్, చాప్‌మన్, విల్ యంగ్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక, బౌల్ట్, సాంట్నర్, నీషమ్, ఫెర్గూసన్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కివీస్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కానీ ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఓడించిన అఫ్గాన్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News