Monday, November 18, 2024

హ్యాట్రిక్‌పై న్యూజిలాండ్ కన్ను.. నేడు బంగ్లాదేశ్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

చెన్నై: వరుస విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న కివీస్‌ను ఓడించడం బంగ్లాదేశ్‌కు తేలికేం కాదనే చెప్పాలి. అఫ్గాన్‌పై అతికష్టం మీద విజయం సాధించిన బంగ్లాదేశ్ తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది.

కివీస్ మాత్రం ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్ జరిగిన మ్యాచ్‌లో కూడా కివీస్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్‌పై కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్లు కాన్వే, యంగ్‌లతో పాటు రచిన్ రవీంద్ర, డారిల్ మిఛెల్, కెప్టెన్ టామ్ లాథమ్ తదితరులు ఫామ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కాన్వే, రచిన్ రవీంద్రలు కళ్లు చెదిరే శతకాలతో అలరించారు. నెదర్లాండ్‌తో జరిగిన పోరులోనూ మెరుగైన బ్యాటింగ్‌తో అలరించారు. బౌలింగ్‌లోనూ కివీస్ బాగానే కనిపిస్తోంది. బౌల్ట్, మాట్ హెన్రీ, సాంట్నర్, ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో కివీస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సవాల్ వంటిదే..
మరోవైపు కివీస్‌తో జరిగే పోరు బంగ్లాదేశ్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. వరుస విజయాలతో జోరుమీదున్న కివీస్‌ను ఓడించాలంటే బంగ్లా అసాధారణ ఆటను కనబరచక తప్పదు. కానీ ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమి బంగ్లా ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. బలహీనమైన అఫ్గాన్‌పై విజయం సాధించేందుకే బంగ్లా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో కివీస్‌తో జరిగే జట్టుకు పరీక్షగా మారింది. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. నజ్ముల్ హుస్సేన్ షాంటో, ఓపెనర్ తంజీద్, మెహదీ హసన్ మీరాజ్, వికెట్ కీపర్ రహీం తదితరులు మెరుగైన ఆటను కనబరచాల్సి ఉంటుంది. బౌలర్లు కూడా రాణించక తప్పదు. అప్పుడే బంగ్లాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News