Sunday, January 19, 2025

చెలరేగుతున్న ఆసీస్ బౌలర్లు.. 14 ఓవర్లలో సౌతాఫ్రికా 44/4

- Advertisement -
- Advertisement -

వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాతో జరగుతున్న మ్యాచ్ లో ఆసీస్ బౌలర్ల నిప్పులు చెరుగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. మొదటి ఓవర్లోనే కెప్టెన్ బవుమా(0)ను స్టార్క్ ఔట్ చేశాడు. తర్వాత మరో ఓపెనర్ డికాక్(3)ను హజిల్ వుడ్ ఔట్ చేశాడు.

అనంతరం వచ్చిన డస్సెన్(6), మార్ క్రమ్(10)లు కూడా ఆసీస్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలవలేక పెవిలియన్ చేరారు. దీంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన క్లాసెస్, డేవిడ్ మిల్లర్ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే, కొద్దిసేపటికే వర్షం కురవడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి  సౌతాఫ్రికా 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెస్(10), డేవిడ్ మిల్లర్(10)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News